వామపక్షాలు తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో బంద్

భారత్ బంద్ పాక్షికం ప్రశాంతం

కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, రైతు సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు భారత్ బంద్ పాక్షికంగా ప్రశాంతంగా జరిగింది. వివరాల్లోకి వెళితే కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతు, కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు భారత్ బంద్ కు మద్దతు గా సిపిఎం, సిపిఐ, తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు.

స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద నుంచి ఆర్టీసీ డిపో, పొగాకు బోర్డు, పోలీసు స్టేషన్, పెద్ద బస్టాండ్, రథం రోడ్ , శివాలయం సెంటర్, చిన్న బస్టాండ్, పెద్ద బస్టాండ్, తాలుకా ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం, ప్రెవేటు, వాణిజ్య సంస్థలను మరియు బ్యాంకులను మూయించారు

భారత్ బంద్ కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ చెందిన బస్సులు మధ్యాహ్నం వరకు నిలిపివేశారు

ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి ఎం రమేష్, సిపిఐ కార్యదర్శి కె వి రత్నం, తెలుగు దేశం పార్టీ నాయకులు గునుపుడి భాస్కర్ , యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ముల్లా ఖూద్దుస్, పొల్లా నరసింహా యాదవ్, నరసింహారావు, షేక్ గౌస్ బాషా, ముల్లా ఖయ్యాం, కిరణ్ కుమార్, మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు