ఎల్ ఎల్ ఆర్ మేళాను సద్వినియోగం చేసుకోండి : ఎంవిఐ సురేంద్ర ప్రసాద్

మీ ముంగిట్లో రవాణాశాఖ కార్యక్రమంలో భాగంగా రవాణాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పొదిలి మండలంలోని పలు గ్రామ పంచాయతీల పరిధిలో 13వతేదీ బుధవారంనాడు ఎల్ ఎల్ ఆర్ మేళా జరుగుతుందని కావున ఆయా పంచాయతీలలోని డైవింగ్ లైసెన్స్ లేని వాహన దారులు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని వాహన తనిఖీ అధికారి సురేంద్రపసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

18సంవత్సరాల వయసు కలిగి గతంలో ఎటువంటి డ్రైవింగ్ లైసెన్సు లేని వారు ఎల్ ఎల్ ఆర్ లైసెన్స్ కొరకు………. కంభాలపాడు – ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల……… తలమళ్ల – పంచాయతీ ఆఫీసు…….. ఉప్పలపాడు – పంచాయతీ ఆఫీసు…….. నందిపాలెం – ఎస్సి కాలనీలోని ప్రభుత్వ పాఠశాల……… మూగచింతల – పంచాయతీ ఆఫీసులలో మేళా నిర్వహించడం జరుగుతుందని ఆయా పంచాయతీలలోని వారు ఆ పంచాయతీలలోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు మరియు ద్విచక్ర వాహన రుసుము 260రూపాయలు అదనంగా వాహనాలను పొందుపరచడానికి ఒక్కో వాహనానికి 150రూపాయలు అదనంగా చెల్లించవలసి ఉంటుందని తెలిపారు.