ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించండి

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ- బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

బిజెపి పొదిలి మండల అధ్యక్షుడు మాకినేని అమరసింహం అధ్యక్షతన జరిగిన ముఖ్య నేతల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీ సూర్యనారాయణ రాజు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరగనున్న చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పోటీ చేస్తుందని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరూ విస్తృతంగా ప్రజల్లో వెళ్లి పట్టభద్రుల నమోదుపై అవగాహన కల్పించాలి అని మరియు శక్తి కేంద్రాల ద్వారా ప్రతి ఒక్కరు ఓటు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆయన సూచించారు.


ప్రతి బూతులో 5 గురు కార్యకర్తలను తయారు చేసి భారతీయ జనతా పార్టీ గెలుపు దిశగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనా తీరును భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు తూర్పారబట్టారు.

పట్టభద్రుల ఓట్లు నమోదు ప్రక్రియలో వాలంటీర్లు జోక్యం పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసామని అయిన వాలంటీర్లు సచివాలయం సిబ్బందిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వాడుకుంటున్నది అన్నారు.

ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలను అమలు పర్చడంలో విఫలమయ్యారని, ఆరోపించారు. మద్య నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తామని చెప్పిన జగన్ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని విమర్శిస్తున్నారు. కేంద్రం అనేక పధకాలు అమలు చేస్తుంటే.. ఏపీ ప్రభుత్వం తమ స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి కోసం కేంద్రం నిధులు మంజూరు చేస్తే.. ఆ ప్రాజెక్టు‌ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం కనీసం భూములు కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రైల్వే ప్రాజెక్టు‌లకు కేంద్రం 75శాతం‌ వాటా ఇస్తే..రాష్ట్ర ప్రభుత్వం 25శాతం వాటా కూడా కేటాయించడం లేదని పేర్కొన్నారు.

ఏపీలో ఇసుక దొరకక, భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కంభం వెంకట రమణ జిల్లా ఉపాధ్యక్షులు పి.వి. శివారెడ్డి, తిండి నారాయణరెడ్డి, జిల్లా కార్యదర్శి రాయపాటి అజయ్ కుమార్ , జిల్లా ప్రధాన కార్యదర్శులు కూకట్ల నాగేశ్వరరావు అశోక్ యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాగులూరు రామయ్య , కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఉన్నం శ్రీను, మార్కాపురం టౌన్ ఓబీసీ అధ్యక్షుడు జేలుకూరి రమేష్ ,కొనకనమిట్ల మండల అధ్యక్షుడు పరమాత్మ , జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి కిలారి శ్రీనివాస రావు, బీజేపీ సీనియర్ నాయకులు సూరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , కొండ్రగుంట నరసింహారావు తదితరులు పాల్గొన్నారు