రేపు పోతవరంలో మెడికల్ క్యాంపు

మార్చి 31వ తేదీ గురువారం నాడు పొదిలి నగర పంచాయితీ పరిధిలోని పోతవరం గ్రామంలో పొదిలి జూనియర్ కళాశాల యన్ యస్ యస్ వాలంటరీస్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

పొదిలి ప్రభుత్వ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని కావున పొదిలి పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు