ఆముదాలపల్లి అక్రమ ఇసుక నిల్వలను సీజ్ చేసిన మైనింగ్ అధికారులు
ఆముదాలపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను మైనింగ్ అధికారులు సీజ్ చేశారు.
వివరాల్లోకి వెళితే మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కందుల నారాయణరెడ్డి నిన్న బుధవారంనాడు ఆముదాలపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను మీడియా ప్రతినిధులకు చూపించి తక్షణమే ఇసుక మాఫియాపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన విషయం విదితమే!….. కందుల డిమాండ్ కు స్పందించిన అధికారులు గురువారంనాడు ఆముదాలపల్లి గ్రామంలోని ఇసుక నిల్వలు గుర్తించి వాటిని సీజ్ చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం మైనింగ్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.