వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి, ఎంఎల్ఏ, కలెక్టర్

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

ప్రకాశం జిల్లా పొదిలి మండలం కొండాయిపాలెం గ్రామంలో వర్షానికి దెబ్బతిన్న పొగాకు , సజ్జా పంటలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా పరిశీలించారు.

అనంతరం మీడియాతో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ దెబ్బతిన్న సజ్జా పంటకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి రైతులను అందుకుంటుందని అదే విధంగా వాణిజ్య పంట అయిన పొగాకు పంట నష్టపరిహారం కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతులను అదుకోనేందకు కృషి చేస్తామని తెలిపారు

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, స్థానిక సర్పంచ్ సన్నెబోయిన మాదవి,జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులు స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు రైతులు తదితరులు పాల్గొన్నారు