సచివాలయాన్ని ప్రారంభించిన ఎంఎల్ఏ కుందూరు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి నగర పంచాయితీ పరిధిలోని సచివాలయం 6 నూతన భవనాన్ని మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
బుధవారం నాడు స్థానిక కాటూరి వారి పాలెం వద్ద 40 లక్షల రూపాయలు అంచనా తో నిర్మించిన పొదిలి సచివాలయం-6, నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక 3వ వార్డు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు కాటూరి శ్రీనివాసులు కార్యనిర్వహకులు కాటూరి ప్రసాద్ , శ్రీరామ వెంకటేశ్వర్లు, అలివేలు వెంకట నారాయణ, కాటూరి అశోక్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డిని పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.
తొలిత శిలాఫలకాన్ని ఆవిష్కరించి అనంతరం సచివాలయాన్ని శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డి , రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ వెంకట రమణ రెడ్డి, కంభం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు ,మాజీ జెడ్పీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావు , మర్రిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకట్ రెడ్డి, మాజీ ఎంపిపి నరసింహారావు, వైసిపి నాయకులు జి శ్రీనివాస్, శ్రీనివాసులురెడ్డి, చెన్నారెడ్డి, స్థానిక వైసిపి నాయకులు జూపల్లి ఏడుకొండలు,శ్రీరాం వెంకటేశ్వర్లు 3వ వార్డు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు కాటూరి శ్రీనివాసులు మరియు వాలంటీర్లు వైసిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.