నగర పంచాయతీ కానున్న పొదిలి గ్రామ పంచాయతీ….

పొదిలి గ్రామ పంచాయతీ త్వరలో నగర పంచాయతీ కానుంది.

వివరాల్లోకి వెళితే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 50గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది.

ఇందులో భాగంగా ప్రకాశంజిల్లాలో పొదిలి, దర్శి, సింగరాయకొండ, టంగుటూరు, వేటపాలెం, మార్టూరు గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చేందుకు మౌలిక సదుపాయాలను గుర్తించి సమగ్ర నివేదికను జులై 31లోగా అందజేయాలని జిల్లా కలెక్టర్ ఇప్పటికే పంచాయతీ కార్యాలయాలకు ఆదేశాలు జారీచేశారు.