గ్రామ వాలంటీర్లు సమగ్రంగా సర్వే చెయ్యాలి

గ్రామ వాలంటీర్లు ప్రభుత్వం తలపెట్టిన వివిధ రకాల సంక్షేమ పథకాల ఎంపిక సర్వే సమగ్రంగా చెయ్యాలిని మండల శిక్షణ అధికారులు అన్నారు. వివరాలు లోకి వెళితే బుధవారం నాడు స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరం లో వైయస్ఆర్ నవశకం పేరుతో ఒక్క రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బియ్యం కార్డు , వైయస్ఆర్ ఆరోగ్య శ్రీ కార్డు , జగనన్న విద్య దివేన ,జగనన్న వసతి దివేన కార్డు , అమ్మబడి , టైలర్స్ , రజక , నాయ బ్రాహ్మణ షాపులు , లబ్ధిదారుల ఎంపిక , వైయస్ఆర్ కాపు నేస్తం , వైయస్ఆర్ పెన్షన్ కనుక కార్డు , వైయస్ఆర్ సున్న వడ్డీ పథకం , వైయస్ఆర్ మత్యకార నేస్తం , వైయస్ఆర్ నేతన్న నేస్తం , ఇమామ్ , మౌజిస్ , పాస్టర్లు ఎంపిక గ్రామసభ నిర్వహణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ తహశీల్దార్ ప్రభాకరరావు ఎంపిడిఓ శ్రీకృష్ణ ఈఓఆర్డీ రాజశేఖర్ మరియు వివిధ శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శిలు మరియు గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు