కళాశాల ఆవరణలో కోవిడ్ పరీక్షల నిర్వహణపై అభ్యంతరం

ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సంజీవని బస్సు ద్వారా నిర్వహిస్తున్న కోవిడ్ పరీక్షల నిర్వహణపట్ల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే స్థానిక విశ్వనాథపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు బాలుర ఉన్నత పాఠశాల ప్రవేశాలు నేటి నుండి ప్రారంభమైన సందర్భంగా పొదిలి టైమ్స్ ప్రతినిధితో బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు మాట్లాడుతూ పాఠశాల మరియు కళాశాలలో నేటి నుండి ప్రవేశాలు ప్రారంభమైన సందర్భంగా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న వాహనాన్ని చూసి పిల్లలు మరియు తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారని……..

పిల్లల ప్రవేశాల నిమిత్తం తల్లిదండ్రులు మరియు పిల్లలు పాఠశాల లోనికి కూడా రాలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు…… పిల్లల ఆరోగ్యం దృష్ట్యా పాఠశాల అవరణలో కోవిడ్ పరీక్షలను మరోచోటికి మార్చాలని మా ప్రాంగణంలో మాత్రం నిర్వహించవద్దని వేడుకుంటున్నామని ఆయన ఈ సదర్భంగా తెలియజేశారు.