మౌనిక రెస్టారెంట్ నందు అక్రమ మద్యం పట్టివేత ఒక్కరి అరెస్టు

మౌనిక రెస్టారెంట్ నందు అక్రమ మద్యం పట్టివేత మరియు ఒక్కరి అరెస్టు సంఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే బుధవారం నాడు స్థానిక విశ్వనాథపురం లోని మౌనిక రెస్టారెంట్ నందు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పొదిలి స్టేషన్ అధికారులు చేసిన దాడుల్లో అక్రమ మద్యం 10 క్వార్టర్లు స్వాధీనం చేసుకొని ఒక్కరిని అరెస్టు చేసినట్లు యస్ఇబి అధికారులు తెలిపారు

ఈ దాడుల్లో పొదిలి యస్ఇబి స్టేషన్ యస్ఐ శ్రీధర్ బాబు, హెడ్ కానిస్టేబుల్ కె వెంకట్రావు, కానిస్టేబులు షేక్ బాజీ సయ్యద్, పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు