ద్విచక్ర వాహనంలో అక్రమ మద్యం పట్టివేత ఒక్కరి అరెస్టు

పరిమితికి మించి మద్యం కల్గిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన శుక్రవారం నాడు చోటుచేసుకుంది.

పొదిలి ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ అధికారుల సాధారణ తనిఖీలో భాగం స్థానిక దరిశి రోడ్ లో నందు నిమ్మవరం గ్రామం చెందిన గుదే హరిబాబు ద్విచక్ర వాహనంలో 15 అక్రమ మద్యం బాటిల్స్ పట్టుకొని అతని అరెస్టు చేసినట్లు యస్ఇబి అధికారులు తెలిపారు.
ఈ దాడుల్లో యస్ఇబి యస్ఐ రాజేంద్రప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ కె వెంకట్రావు కానిస్టేబులు షేక్ బాజీ సయ్యద్, యస్ యన్ గురవయ్య, ఆర్ సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు