ఇంటి పన్ను, కళాయి పన్నులు క్రమబద్దీకరణ కై ప్రజలు సహాకరించాలి: నగర పంచాయతీ కమీషనర్ భవాని ప్రసాద్

ఇంటి పన్ను కళాయి పన్నులు క్రమబద్దీకరణ కై ప్రజలు సహాకరించాలని పొదిలి నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్
ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్, నగర పంచాయతీల నందు ఇంటి పన్నులు, కుళాయి పన్నులు క్రమబద్దీకరణ చెయ్యాలని ఆదేశాల మేరకు పొదిలి నగర పంచాయితీ సిబ్బంది సోమవారం నుంచి ఇంటి ఇంటికి సర్వే నిర్వహిస్తారని వారికి ప్రజలు సహాకరించాలని శనివారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు