పీకే టీమ్ తో భేటీ అయిన జంకె, ఉడుముల, కేపి…….చర్చ మధ్యలోనే అర్ధంతరంగా వెనుదిరిగిన జంకె

కేపి కుటుంబానికి సానుకూలంగా ఉన్న పీకే టీమ్

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ అభ్యర్థిత్వ
సమస్య రోజుకో మలుపు తిరుగుతుంది. 2019ఎన్నికలలో కేపి కుటుంబం నుండే వైసీపీ అభ్యర్థి ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఖరారు విషయమై హైదరాబాదులో ప్రశాంత్ కిషోర్ టీమ్ నిర్వహించిన భేటీకి జంకె, ఉడుముల, కేపి హాజరయ్యారు. తొలుత ఉడుముల శ్రీనివాసరెడ్డి, కేపి కొండారెడ్డి, కేపి కుమారులు నాగార్జునరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలతో సమావేశమైన పీకే టీమ్ తో వారు మాట్లాడుతూ 2014 కందుకూరులో జరిగిన సభలో మాకు అవకాశం కల్పించమని అడగగా 2019 ఎన్నికలలో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారని…… ఆ సమయంలో జంకె వెంకటరెడ్డి కూడా ఈ అవకాశం నాకు ఇవ్వండి 2019లో తప్పుకుంటానని చెప్పారని కాబట్టి ఇప్పుడు తమకు అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం.

అనంతరం కేపి కుటుంబ సభ్యులు మరియు ప్రస్తుత శాసన సభ్యులు జంకె వెంకటరెడ్డితో సమావేశం అయిన పీకే టీమ్ 2014ఎన్నికలలో అవకాశం కల్పిస్తే 2019లో పోటీ చేయనని అన్నారా? అని పీకే టీమ్ ప్రశ్నించగా అవునని చెప్పిన జంకె మీకు ఇంక ఏమైనా కావాలంటే కోరుకోండి అనగా నాకు అసెంబ్లీ టికెట్ కేటాయించాల్సిందే అని అక్కడినుండి లేచి వెళ్లిపోయారని విశ్వసనీయ సమాచారం.

అనంతరం 20నిమిషాల పాటు కెపితో సమావేశం నిర్వహించిన పీకే టీమ్ పలు అంశాలపై చర్చించి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన పూర్తి చేసుకుని రాగానే మరోసారి ఇలానే ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థిని ఖరారు చేస్తామని తెలిపినట్లు సమాచారం.