తాత్కాలికంగా మున్సిపల్ కార్మికుల సమ్మె వాయిదా

పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులు 5నెలల జీతాలు ,ఇతర పెండింగ్ సమస్యలపై ఈ నెల 23నుండి జరపతలపెట్టిన నిరవధిక సమ్మెను మున్సిపల్ కమీషనర్ భవానీ ప్రసాద్ ,శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతీరావు ఇచ్చిన హమీ మేరకు కోవిడ్ ను ధృష్టిలో ఉంచుకోని తాత్కాలికంగా వాయిదా వేస్థున్నట్లు సిఐటియు పశ్చిమ ప్రకాశంజిల్లా ప్రదానకార్యదర్శి యం.రమేష్ ,ఎపి మున్సిపల్ వర్కర్స్&ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు)పొదిలి నగర పంచాయితీ అధ్యక్షకార్యదర్శులు జి.నాగులు ,డి.సుబ్బయ్య ఒక ప్రకటనలో తెలిపారు.మున్సిపల్ కార్మికుల జీతాల ,పెండింగ్ సమస్యలపై గత 3నెలలుగా అదికారులకి విన్నవించినా పరిష్కారం లభించకపోవడంతో ఈనెల 23 నుండి నిరవధికసమ్మెలోకి వెళుతున్నామని ఈనెల 9నోటీస్ ఇచ్చారు.ప్రతి రోజు కార్మికులునిరసన తెలిపారు.స్పందించిన మున్సిపల్ కమీషనర్ ,శానిటరీ ఇన్స్పెక్టర్ యూనియన్ నాయకులతో చర్చలు జరిపి మే 1నాటికి జీతాలు చెల్లస్థామని , పట్టణంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని పరిస్థితిని అర్దంచేసుకోని వాయిదా వేయాలని మున్సిపల్ కమీషనర్ కోరడంతో కార్మికులు చర్చించుకొని తాత్కాలికంగా సమ్మెను వాయిదావేశారు.మున్సిపల్ కమీషనర్ ఇచ్చిన హామీ అమలుజరగకుంటే మే 5 నుండి సమ్మెలోకి వెళతాని కార్మికులు తెలీపారు.ఈ చర్చలలో మున్సిపల్ కార్మికులు కెవి నరసింహం ,బి.కోటేశ్వరావు,సుబ్బులు ,రాజయ్యలు తదితరులు  పాల్గొన్నారు.