పొదిలిని జిల్లా కేంద్రం చేయాలని ఉద్యమానికి సిద్ధమవుతున్న ప్రజలు

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుండడంతో పొదిలిని జిల్లా కేంద్రంగా పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ పొదిలి పట్టణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, దరిశి, కొండేపి నియోజకవర్గాలలో కనిగిరి, చంద్రశేఖరాపురం, వెలిగండ్ల, హనుమంతనిపాడు, పిసి పల్లి, పామూరు, గిద్దలూరు, కోమరోలు, రాచర్ల, బేస్తవారిపేట, కంభం, అర్ధవీడు, పెద్దారవీడు, పెద్ద దోర్నాల, యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పుల్లలచెరువు, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు, దరిశి, తర్లుపాడు, కొనకనమిట్ల, మర్రిపూడి, పొదిలి మండలాలను కలుపుకుని పొదిలిని జిల్లాకేంద్రంగా నూతన జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజలు ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు.

గతంలో జిల్లాల పునర్విభజన చేస్తారని వార్తలు రాగా అప్పటి ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి పొదిలిని జిల్లాకేంద్రం చేసి కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నేపథ్యంలో…… నేడు రాష్ట్రప్రభుత్వంలో ఒక కీలకమైన వ్యక్తిగా కూడా ఉండడంతో ప్రత్యేక జిల్లాను సాధించుకోవడంలో కలిసి వచ్చే అంశాలుగా పరిగణిస్తూ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసి ప్రజా ఉద్యమం ద్వారా సాధించుకునేందుకు పట్టణ ప్రముఖులు మంతనాలు జరుపుతున్నారు