పొదిలి నగర పంచాయితీ ఓటర్ జాబితాను ఆవిష్కరించిన కమీషనర్

పొదిలి నగర పంచాయితీ ఓటర్ జాబితాను నగర పంచాయితీ కమిషనర్ భవాని ప్రసాద్ ఆవిష్కరించారు.

వివరాల్లోకి వెళితే పొదిలి నగర పంచాయితీ కార్యాలయం నందు శనివారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పంచాయితీ కమిషనర్ భవాని ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల అధారిటీ సూచనల మేరకు పొదిలి నగర పంచాయితీ నుంచి 20 వార్డుల గా విభజన చేసి సదరు 20 వార్డుల జాబితాను తేదీ 01.01.2021 వరకు ఉన్న మార్కాపురం శాసనసభ నియోజకవర్గం జాబితాను అనుసరించి అందులో ఉన్నటువంటి పొదిలి నగర పంచాయితీ పరిధిలో ఉన్న 20 వార్డుల ఓటర్లను గుర్తించి వార్డుల వారీగా జాబితా ను తయారు చేసి అట్టి ఓటర్ జాబితాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు మరియు మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం, నగర పంచాయితీ కార్యాలయం వద్ద ఉంచుతున్నట్లు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మార్కాపురం శాసనసభ నియోజకవర్గం ఓటర్ల నమోదు అధికారి మరియు రెవిన్యూ డివిజన్ అధికారి వారి సంప్రదించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగర పంచాయితీ అధికారులు మారుతిరావు , సత్యానారాయణ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు