రాష్ట్ర స్థాయి సేపక్ తాక్రా పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన పొదిలి జట్టు

రాష్ట్ర జట్టు కు ఎంపికైన పొదిలి విద్యార్థి గురు శేఖర్

 

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పశ్చిమగోదావరి జిల్లా దొమ్మెరు లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సేపక్ తాక్రా పోటీల్లో సబ్ జూనియర్ కేటగిరీలో నందు ప్రభుత్వం బాలుర ఉన్నత పాఠశాల పొదిలి చెందిన జట్టు ఉత్తమ ప్రతిభ చూపి ద్వితీయ స్థానం సాధించింది.

బుధవారం నాడు స్థానిక పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు జట్టు సభ్యులు సిహెచ్ గురు శేఖర్ , అజయ్ కుమార్, శివ కృష్ణ లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ‌ వి రంగయ్య అభినందించారు.

ఈ సందర్భంగా ఈ వి రంగయ్య మాట్లాడుతూ తమ పాఠశాల చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపి‌ రాష్ట్ర స్థాయి లో ద్వితీయ స్థానం సాధించారని అదే విధంగా రాష్ట్ర జట్టు కు గురుశేఖర్ ఎంపిక కావటానికి కారణమైన పిడిలు రామకృష్ణ, ప్రసాద్ లను మరియు విద్యార్థులను అభినందించారు.

రాష్ట్ర జట్టు కు ఎంపికైన గురుశేఖర్ మాట్లాడుతూ అక్టోబర్ లో కర్నాటక రాష్ట్రంలో నందు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని జాతీయ పోటీల్లో ప్రతిభా చూపుతానని ధీమా వ్యక్తంచేశారు.