బిసి వాద సాహిత్యం పై డాక్టరేట్ సాధించిన పొదిలి ఆణిముత్యం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన పిహెచ్ డి (వివా) లో బిసి వాద సాహిత్యంలో ఉత్తమ ప్రతిభ ఆధారంగా పొదిలి పట్టణం పొదిలమ్మ నగర్ చెందిన పారెళ్ళ బాల ఆంజనేయులుకు డాక్టరేట్ ను ప్రదానం చేశారు.

పొదిలి పట్టణంలోని పొదిలమ్మ నగర్ లో నివాసం ఉంటున్న పారెళ్ళ వెంకటేశ్వర్లు రవణమ్మ రెండోవ కుమారుడు బాల ఆంజనేయులు 2018 సంవత్సరంలో నిర్వహించిన డీఎస్సీ నందు జిల్లాలో రెండో స్థానం సాధించి తెలుగు స్కూల్ అసిస్టెంట్ గా నియామకం అయ్యారు.

తనకు మార్గదర్శకం చేసిన తన చిన్ననాటి గురువులు వెన్నెల మల్లికార్జున రావు పద్మావతి వెంకటరమణ లక్ష్మణ శాస్త్రి రామాంజనేయులు కృష్ణారెడ్డి జిలాని శివరాత్రి శీను మరియు పలువురు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.

డాక్టరేట్ సాధించిన బాల ఆంజనేయులను పట్టణంలోని పలువురు ప్రముఖులు అభినందించారు