ఎల్ ఐ సి కార్యాలయం వద్ద నిరసన

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి) పాలసీదారులకు బోనస్ పెంచాలని, ఇన్సూరెన్స్ పాలసీలపై జిఎస్టి రద్దు చేయాలని కోరుతూ గురువారం నాడు పొదిలి స్థానిక శాటిలైట్ బ్రాంచ్ కార్యాలయం వద్ద ఏజెంట్లు ఆందోళన నిర్వహించారు.

సుమారు రెండు గంటల పాటు కార్యకలాపాలు బహిష్కరించి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ సంఘం గౌరవాధ్యక్షులు కూకట్ల ఆదినారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పాలసీదారులపై విధించిన జిఎస్టి తొలగించాలని ఖాతాదారులకు పాలసీల ఆర్థిక సంబంధ కార్యకలాపాలపై విధించే వడ్డీ రేట్లు తగ్గించాలన్నారు.

సీనియర్ ఏజెంట్ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పైబడిన పాలసీల పునరుద్ధరణకు సంస్థ అవకాశం ఇవ్వాలని ఏజెంట్లకు గ్రాట్యూటీ 20 లక్షల పెంచాలని, 2013, 2016 ఐఆర్డీఏ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కమిషన్ పెంచాలని డిమాండ్ చేశారు.

మేడ నరసింహారావు మాట్లాడుతూ ఏజెంట్లు అందరికీ గ్రూప్ మెడి క్లెయిమ్ వర్తింపచేయాలని కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, టర్మ్, గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచాలని, ఏజెంట్ల పిల్లలకు ఎడ్యుకేషనల్ అడ్వాన్స్ ఇవ్వాలని, క్లియా ఏజెంట్లకు సదుపాయాలు పెంచాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమానికి జేఏసీ నాయకులు నర్రా వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షతన జరిగింది.

ఈ కార్యక్రమంలో సీనియర్ ఏజెంట్లు శివ సుబ్రహ్మణ్యం, నల్లపు తిరుపతి రెడ్డి, దేవిరెడ్డి ఆంజనేయులు, జె వి రమణయ్య, ఎం ప్రభాకర్, ఎం పుల్లయ్య, కె ఎస్ ఎన్ చౌదరి మోహన్ రెడ్డి, ఎం వి గిరి శేఖర్, జాజుల శ్రీను, జోగి రమణయ్య ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు