భక్తి శ్రద్ధలతో ఈద్-ఉల్-ఫితర్

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పవిత్ర రంజాన్‌మాసం ముగియడంతో మంగళవారంవారం పొదిలి పట్టణాలలో ముస్లింలు ఘనంగా రంజాన్ పండుగను జరుపుకొన్నారు.

సోమవారం నెలవంక దర్శనం కావడంతో ముస్లిం మత పెద్దలు పండుగ నిర్వహించాలని ప్రకటించడంతో ముస్లింలు కొత్త బట్టలను ధరించి స్థానిక ఈద్గా వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

నెల రోజుల పాటు భక్తి ప్రపత్తులతో ఉపవాస దీక్షలు నిర్వహించిన ముస్లింలు దీక్షలకు పరిపూర్ణ ఫలితం లభించే రంజాన్ పండుగ రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో ఈద్గా వద్ద నమాజ్, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు, పిల్లలు కొత్త దుస్తులు ధరించి చిన్నాపెద్ద తేడా లేకుండా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ప్రత్యేక ప్రార్ధనలు, నామజు చేసారు. ముస్లిం సోదరులను ఆత్మీయ ఆలింగనం చేసుకొని వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు

లాక్ డౌన్ కారణంగా రెండు సంవత్సరాల తరువాత సాముహిక ప్రార్థనలు నిర్వహించటం తో వేలాది మంది తరలి వచ్చారు.

ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా దరిశి డియస్పీ నారాయణ స్వామి రెడ్డి ఆదేశాలు తో సిఐ సుధాకర్ రావు , పొదిలి,మర్రిపూడి యస్ఐలు శ్రీహరి అంకామ్మరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.