సుపోషిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యం గా పనిచేయాలి: ఎంఎల్ఏ కుందూరు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఆరోగ్యకరమైన పోషకాహారం ప్రదర్శన లో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.
వివరాల్లోకి వెళితే మంగళవారం నాడు స్థానిక పొదిలి బాలురు ఉన్నత పాఠశాల నందు పొదిలి ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిణి సుద మారుతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు లో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుపోషిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యం గా పోషకాహారం అందించే దిశగా అడుగులు వేస్తుందని అందులో భాగంగా సెప్టెంబర్ మాసంలో పోషకాహారం సదస్సు నిర్వహిస్తు ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం విజయవంతం కావటానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
అనంతరం అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు తయారు చేసిన బెల్లం, రాగులు సజ్జలు జొన్నలు మొక్క జొన్న, కందులు పెసలు శనగలు మినుములు పలు రకాల గింజలు వివిధ కూరగాయలు తయారు చేసిన వంటల ప్రదర్శనలో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్ని రుచులను ఆరగించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు షేక్ నూర్జహాన్, మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డి,
అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు