గ్రామీణ నీటి సరఫరా ఉద్యోగుల సహాయ నిరాకరణ దీక్ష

గ్రామీణ నీటి సరఫరా ఉద్యోగుల సహాయ నిరాకరణ దీక్ష

గ్రామీణ నీటి సరఫరా ఉద్యోగులు సహాయ నిరాకరణ దీక్ష చేపట్టారు. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నీటి సరఫరా ఇంజినీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక పొదిలి రక్షిత నీటి సరఫరా డివిజన్ ఇంజనీర్ కార్యాలయం వద్ద శుక్రవారం నాడు సహాయ నిరాకరణ దీక్ష చేపట్టారు.

దీక్షనుద్దేశించి డిఇ సిహెచ్ ఎల్లయ్య మాట్లాడుతూ పెరిగిన పని భారం వలన గతంలో ఉన్న వర్క్ ఇన్స్పెక్టర్ల స్ధానంలో సైట్ ఇంజనీర్లను నియమించాలని…. క్షేత్ర స్ధాయిలో పని చేసే అధికారులకు యఫ్టిఏ మంజూరు చేయాలని…. 2008లో జిఓ నెంబర్ 512 ప్రకారం పంచాయితీ రాజ్ విభజన చేసి నేటికీ పది సంవత్సరాలు అయినప్పటికీ పిఆర్ శాఖ ప్రమోషన్లు సిఫారసులు చేయలేదని ఇటువంటి పలు డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ 19వ తేది నుండి 24వ తేది వరకు సహాయ నిరాకరణ దీక్షలు…. 25వ తేది నుండి నిరాహార దీక్షలు చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో కనకం నారాయణస్వామి, ఎం శ్రీకాంత్, ఆర్ స్రవంతి, నవీన్, వివి రమణ, యస్ఆర్ జిలానీ, షేక్ రఫీ, కళాప్రపూర్ణ,
దైనిక ప్రసాద్, కర్ణ వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.