సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం : మాగుంట

సాగర్ నీటితో పొదిలి పెద్ద చెరువులో సమ్మర్ స్టోరేజ్ ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనువాసులరెడ్డి అన్నారు.

సోమవారంనాడు స్ధానిక విశ్వనాథపురం నందు జై జగన్ మహిళా గ్రూపు ఏర్పాటు చేసిన సన్మానసభలో ముఖ్య అతిధిగా హాజరైన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనువాసులరెడ్డి మాట్లాడుతూ పొదిలి పెద్ద చెరువును సమ్మర్ స్టోరేజ్ గా మార్చుటకు గత ప్రభుత్వంలో 33 కోట్లతో అనుమతులు మంజూరు చేయడం జరిగిందని ఎన్నికల కోడ్ రావడంతో జాప్యం జరిగిందని త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిసి త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభం జరిగేలా కృషి చెస్తామని హామీ ఇచ్చారు.

మార్కపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగర్జునరెడ్డి మాట్లాడుతూ శాసనసభ్యుల ప్రమాణస్వీకరం కార్యక్రమం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించే విధంగా కృషి చేస్తానని అన్నారు. దోర్నాల వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనువాసులరెడ్డి మరియు శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డిలను మహిళలు ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కెపి కొండరెడ్డి ఉడుముల శ్రీనువాసులరెడ్డి, మండల పరిషత్ అధ్యక్షులు కె నరసింహరావు, ఉడుముల రామనారాయణరెడ్డి, జడ్పీటిసి సభ్యులు మెట్టు వెంకటరెడ్డి, సాయి రాజేశ్వరరావు, వైసీపీ నాయకులు వాకా వెంకటరెడ్డి, ఘనశ్యాం తదితరులు పాల్గొన్నారు.