తలమల్ల లో ముమ్మరంగా శానిటేషన్ పనులు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి మండలం పరిధిలోని తలమల్ల గ్రామ పంచాయతీ నందు ముమ్మరంగా శానిటేషన్ పనులు నిర్వహించారు.

విష జ్వరాల దృష్ట్యా  పంచాయతీ అధికారులు ముందస్తు చర్యలలో భాగంగా స్థానిక పొదిలి మండల పరిధిలోని తలమల్ల గ్రామ నందు పారిశుద్ధ్య పనులు దోమల మందు ను పిచికారి చేసారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ వెంకట సుబ్బమ్మ
పంచాయతీ కార్యదర్శి శేషగిరిరావు , మరియు పంచాయితీ సిబ్బంది మరియు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు