చెత్త వ్యర్థల విభజన స్వచ్చ పొదిలి లక్ష్యం: కమిషనర్ డానియల్ జోసప్

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

చెత్త వ్యర్థల విభజన చేసి స్వచ్చ పొదిలి లక్ష్యం గా పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ అన్నారు.

వివరాల్లోకి వెళితే స్వచ్ఛత లక్ష్యంగా ప్రచారంలో భాగంగా స్థానిక బాలికల ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన పొదిలి మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ మాట్లాడుతూ పాఠశాల నందు విద్యార్థులు పనికి రాని కాకితాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెట్టెలో వెయ్యాలని అదే విధంగా నివాస గృహాల్లో కూడా తడి పొడి చెత్తాలను వేరు వేరు డబ్బాలో వెయ్యాలని ప్రతి ఒక్కరూ స్వచ్చ పొదిలి లక్ష్యం పని చేయలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డి, మున్సిపల్ అధికారులు మారుతిరావు, రవీంద్రుడు మరియు బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు