ఎస్ఐ శ్రీరామ్ ఆధ్వర్యంలో 2కె రన్

పొదిలి ఎస్ఐ శ్రీరామ్ ఆధ్వర్యంలో 2కె రన్ ను నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే పొదిలి ఎస్ఐ శ్రీరామ్ గురువారంనాడు ఏర్పాటు చేసిన 2కె రన్ కార్యక్రమం స్థానిక చిన్నబస్టాండు సెంటర్ నుండి విశ్వనాథపురం మీదుగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 2కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. అనంతరం పరుగులో పాల్గొన్నవారికి నిమ్మరసం అందజేశారు.

ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పొదిలి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.