బ్యాంకుల సేవల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలి : ఎస్ఐ శ్రీరామ్

బ్యాంకు సేవలు వినియోగించుకునే వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పొదిలి ఎస్ఐ శ్రీరామ్ అన్నారు.

వివరాల్లోకి వెళితే స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొదిలి శాఖ నందు వినియోగదారుల అవగాహనా కార్యక్రమం నిర్వహించిన ఎస్ఐ శ్రీరామ్ మాట్లాడుతూ ఇటీవల పెరిగిపోయిన ఎటిఎం మోసాలను గురించి వివరిస్తూ ఎటిఎంలో ఎవరి కార్డు వారే వినియోగించుకోవాలని అలాగే అపరిచిత వ్యక్తుల ద్వారా నగదు విత్ డ్రా చేయించవద్దని…… అలాగే బ్యాంకు నుండి నగదు తీసుకుని వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని మన దృష్టి మరల్చి డబ్బును అపహరించే దొంగలు తిరుగుతుంటారని అలాంటి వారిపట్ల కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని సూచించారు.

అలాగే ఇటీవల పెరిగిపోయిన ఆన్లైన్ మోసాలను గురించి వివరిస్తూ బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నామని మీ ఎటిఎం వివరాలను అలాగే మీకు వచ్చిన ఓటిపి నంబరు చెప్పమని వచ్చే ఫోన్ కాల్స్ ని నమ్మవద్దని….. బ్యాంకు అధికారులు వివరాలను ఎప్పుడూ అడగరని తెలిపారు. కాబట్టి వినియోగదారులు తమ బ్యాంకు అకౌంట్ కి సంబంధించిన లావాదేవీలలో జాగ్రత్త వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్, బ్యాంకు సిబ్బంది, వినియోగదారులు, తదితరులు పాల్గొన్నారు.