ఇప్పటివరకు పట్టణంలో రికార్డు 32….. నేడు అత్యధికంగా 45కోవిడ్ కేసులు

పట్టణంలో ఇప్పటి వరకు అత్యధిక ఒకేరోజులో నమోదైన కోవిడ్ రికార్డు 32 కాగా…… నేడు అత్యధికంగా 45కేసులు నమోదయ్యాయి.

స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో నేడు నిర్వహించిన కోవిడ్ ర్యాపిడ్ టెస్టులో 14పాజిటివ్ కేసులు నమోదు కాగా…… కోవిడ్ వైద్యశాల విడుదల చేసిన ప్రత్యేక బులిటెన్ లో నేడు 31కోవిడ్ కేసులు…… మొత్తం నేడు 45కేసులతో కలుపుకుని మొత్తం ఇప్పటి వరకు 373కేసులు నమోదయ్యాయి.

ప్రజలకు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు…. అత్యవసర సమయాలలో బయటికి వచ్చినా మాస్కులు ధరించి భౌతికదూరం పాటిస్తూ అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయమని అధికారులు ఎంత చెప్తున్నా ప్రజలలో మార్పు రావడం లేదు….. పట్టణంలో లాక్ డౌన్ విధించి రెడ్ జోన్ లను ఏర్పాటు చేసినప్పటికీ కోవిడ్ కేసులు అమాంతం రోజురోజుకు పెరుగుతున్నాయంటే పూర్తిగా ఇది ప్రజల నిర్లక్ష్యం కారణంగానే…..

ఇప్పటికైనా ప్రజలు అధికారులు సూచించిన విధంగా జాగ్రత్తలు పాటించాలని లేకపోతే మరింత ప్రమాదంలోకి పొదిలి పట్టణం చేరుకుంటుందని టాస్క్ ఫోర్స్ టీమ్ హెచ్చరిస్తోంది.