న్యాయమూర్తి రాఘవేంద్రకు ఘన వీడ్కోలు

పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి రాఘవేంద్రకు పారా లీగల్ వాలంటీర్ బొనిగల లక్ష్మీ వీడ్కోలు పలికారు.

వివరాల్లోకి వెళితే పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జిగా రెండున్నర సంవత్సరాల కాలం పాటు జడ్జిగా విధులు నిర్వహించిన రాఘవేంద్ర బదిలీపై శ్రీకాళహస్తి వెళుతున్న సందర్భంగా లీగల్ పారా వాలంటీరు బొనిగల లక్ష్మీ ఆయనను సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా ఆయన పారా లీగల్ వాలంటీర్ లక్ష్మీతో మాట్లాడుతూ న్యాయశాఖ నందు కీలకమైన బాధ్యతలు సంపాదించి ఉన్నతస్థాయి ఎదగాలని ఆకాంక్షించినట్లు బొనిగల లక్ష్మీ సామాజిక మధ్యమం ద్వారా తెలిపారు.