విష జ్వరాల దృష్ట్యా ప్రత్యేక వైద్య శిబిరం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

కొనకనమిట్ల మండలం ముమ్మయ్య పాలెం నందు శనివారం నాడు డాక్టర్ బాలయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

మొత్తం గ్రామంలో ఇంటి ఇంటికి తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో ఐదుగురికి విష జ్వరాల ఉన్నట్లు గుర్తించి వారికి చికిత్స అందించడం జరిగిందన్ని ఒక ప్రకటన విడుదల చేశారు.

గ్రామంలో సమావేశం నిర్వహించి దోమల పట్ల అప్రమత్తంగా ఉండి తమ నివాస ప్రదేశాలలో నీరు నిల్వ లేకుండా చూడాలని దోమల నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది జహీర్, ప్రతాప్ రెడ్డి, సునితా, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు