పోలీసులకు పోలీసులే అండగా నివాలనే ఎస్పీ పిలుపుకు విశేష స్పందన

ఓ పోలీసు కానిస్టేబుల్ పరిస్థితికి చలించిపోయిన ప్రకాశం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సిద్దార్థ్ కౌశల్ ఇచ్చిన పిలుపుకు జిల్లా పోలీసులనే కాకుండా పక్క జిల్లాల పోలీసులను కూడా కదిలించింది.

వివరాల్లోకి వెళితే ఒంగోలు రెండవ పట్టణ పోలీసు ఠాణా నందు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అంకయ్య భార్యకు పురిటి నొప్పులు రావడంతో ఒంగోలు సంఘమిత్ర ఆసుపత్రిలో చేర్పించగా ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనివ్వగా……
సరైన ఎదుగుదల లేకుండా పుట్టిన ముగ్గురు శిశువులను మెరుగైన వైద్యం అందించేందుకు విజయవాడలోని రెయిన్ బో ఆసుపత్రికి తరలించగా వైద్యులు వెంటిలేటర్ పై ఉంచారు…..

శిశువులను కాపాడుకునేందుకు సరైన ఆర్ధిక స్థోమత లేని అంకయ్య విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సిద్దార్ద్ కౌశల్ పోలీసులకు పోలీసులే అండగా ఉండాలని ఇచ్చిన పిలుపు మేరకు ప్రకాశం జిల్లా పోలీసు అధికారులే కాక పక్క జిల్లాల పోలీసు అధికారులు కూడా మేముసైతం అంటూ స్పందించి అందించిన ఆర్ధిక సహాయం చేయగా వచ్చిన 10లక్షల రూపాయలు చెక్కును ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అంకయ్యకు అందజేశారు.

పోలీసు శాఖలో ఒకరికి ఒకరు అండగా నిలవాలి అనే ఆలోచనతో పిలుపునిచ్చిన ప్రకాశం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సిద్దార్థ్ కౌశల్ ను పోలీసు శాఖ అధికారులే కాక పలు శాఖల అధికారులు ప్రజలు ప్రశంసించారు.