లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : సిఐ శ్రీరామ్

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినా అందుకు విరుద్ధంగా షాపులు తెరచినా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ శ్రీరామ్ హెచ్చరించారు.

వివరాల్లోకి వెళితే స్థానిక లాక్ డౌన్ నియమ నిబంధనలపై దర్శి రోడ్డులోని మంజునాథ కళ్యాణ మండపం నందు దుకాణదారులు, వ్యాపారస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ శ్రీరామ్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా ఉదయం 6గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఉందని…… బంగారు, బట్టలు, చెప్పుల దుకాణాలు పూర్తిగా మూసివేయాలని నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అలాగే ప్రతి దుకాణం వద్ద శానిటైజర్ అందుబాటులో ఉంచాలని, కొనుగోలు దారులు మాస్కు ధరించి భౌతిక దూరం పాటించేలా చూడాల్సిన బాధ్యత దుకాణదారులదే అని అన్నారు.

ప్రజలు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పోలీసు, వైద్య, పారిశుద్ధ్య శాఖలకు సహకరిస్తూ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సహకరించాలని సిఐ శ్రీరామ్ కోరారు.ఈ కార్యక్రమంలో పొదిలి యస్ఐ సురేష్ మరియు వివిధ వ్యాపార సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు