సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు

 

వర్షాల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం

వ్యక్తిగత, పరిసరాల శుభ్రతతోనే ఆరోగ్యం

వైద్యారోగ్య శాఖ అధికారిణి సుష్మా

గత పది రోజులుగా వర్షాలు కురుస్తున్నందున సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నాం.. సీజనల్‌ వ్యా ధులు ప్రజల కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం’.. అని ఉప్పులపాడు వైద్యారోగ్య శాఖ అధికారిణి టి సుష్మా పేర్కొన్నారు.

జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జిల్లా అధికారుల ఆదేశానుసారం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ప్రజలు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఏమైనా ఇబ్బందులుంటే దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.

ముఖ్యంగా నీటి నిల్వతో డెంగీ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదమున్నందున ప్రజలు నీరు నిల్వ లేకుండా చూసుకునేలా ఆశ వర్కర్లతో అవగాహన కల్పిస్తున్నం. ఎవరికైనా దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలుంటే, వెంటనే దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలని మండలం పరిధిలో ఎక్కడైనా పరిస్థితి తీవ్రంగా ఉంటే ఎపిడమిక్‌ టీమ్‌లను సిద్ధంగా ఉంచాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని‌ తెలిపారు.

వర్షాకాలం దృష్ట్యా సీజనల్‌ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నందున్న ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. వేడి, కాచి చల్లార్చిన నీరు మాత్రమే తీసుకోవాలి. వేడివేడి ఆహా ర పదార్థాలకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణులు ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలని
ఆమె అన్నారు.

వర్షంతో ఇంటి ఆవరణలోని పూల కుండీలు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. వాటర్‌ ట్యాంకులను 10రోజులకోసారి శుభ్రం చేయాలని నీరు కలుషితం కావడంతో డయేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఈగలు, దోమలు వృద్ధి చెందకుండా చూడాలని నిల్వ పెట్టిన పదార్థాలను వాడవద్దు. ఆరుబయట చిరుతిండ్లను , వీలైనంత ఎక్కువగా మాంసాహారం తినకూడదని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఆశ వర్క ర్లు, అంగన్‌వాడీలు, ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బందితో కలిసి ప్రజలకు సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

మున్సిపల్, పంచాయతీ రాజ్‌శాఖ అధికారుల సమన్వయంతో తాగునీరు సరఫరా చేసే ఓవర్‌ హెడ్‌ట్యాంక్‌లను వారానికోసారి బ్లీచింగ్‌ వేసి శుభ్రపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు