స్వచ్ఛతకు ఆమడదూరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలోని స్వచ్ఛతకు స్థానిక మండల రెవిన్యూ తహశీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆమడదూరంలో ఉంది.

ఈ ప్రాంగణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల,ఉర్దూ పాఠశాల, రెండు అంగన్వాడీ సెంటర్లు నిర్వహిస్తున్న ఈ పాఠశాలలలో సుమారుగా 650కు పైగా బాలబాలికలు విద్యను అభ్యసిస్తూ ఉండగా….. పాఠశాలలో మరుగుదొడ్లలో నీరు లేక అలాగే పరిశుభ్రత లోపించి దుర్గంధం వెదజల్లుతున్న పరిస్థితి. బాలికల మలమూత్రాలకు వెళ్లాలంటే పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. నీరులేక మలమూత్రాల గదులకు తాళం వేసిన పరిస్థితి చూస్తే అయ్యో అనడం అతిశయోక్తి కాదేమో!..

మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా అక్కడే భోజనం తయారు చేయవలసి ఉండగా…. భోజనం తయారీలో భాగంగా వాడేసిన నీరు ఎక్కడికక్కడ వదలడంతో పాఠశాలలో వాడేసిన నీరు బయటికి పోయేందుకు డ్రైనేజీ వ్యవస్థ కూడా లేకపోవడంతో నీరు అక్కడికక్కడే నిలిచి మురికి కుంటలా ఏర్పడడంతో పట్టపగలే దోమలు బెడదకు విద్యార్థులు అల్లాడిపోతున్నారు. వీటిద్వారా విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉండడంతో ఇంతకు ముందు ఉన్న ఉపాధ్యాయులు సాధ్యమైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరినా కూడా సమస్యకు సరైన పరిష్కారం దొరకలేదని విద్యార్థులు చెప్తుండగా……

ఈ విషయంపై నూతనంగా బదిలీపై వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు బివి పద్మావతి మాట్లాడుతూ….. నూతనంగా బదిలీపై ఈ పాఠశాలకు రావడం జరిగిందని…. అధికసంఖ్యలో విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ప్రధానంగా ఉన్న నీటి సమస్యతో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వాన్నంగా ఉందని నీరు లేకపోవడం, డ్రైనేజీలు లేకపోవడం, శుభ్రం చేసేవారు లేకపోవడం, సరిపడా బాత్రూమ్ లు లేకపోవడం వంటి సమస్యలతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, ఈ పాఠశాలలో ఎక్కువగా బాలికలు ఉన్నారని వారు టాయిలెట్స్ లేక పడుతున్న ఇబ్బందిని గుర్తించి అధికారులు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.