సింథటిక్ టోకెన్లతో నీటి సరఫరాకు శ్రీకారం చుట్టిన పంచాయతీ పాలకవర్గ మాజీ సభ్యులు బాషా

పొదిలి గ్రామ పంచాయితీ మాజీ సభ్యులు ముల్లా ఖాదర్ బాషా తనకు కేటాయించిన ట్యాంకర్ ద్వారా చేపట్టిన నీటి సరఫరా కోసం ప్రతి ఇంటికి సింథటిక్ టోకెన్లు ఇచ్చి వాటి ద్వారా నీటి సరఫరాకు శ్రీకారం చుట్టారు.

వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణంలో తీవ్ర నీటి సమస్య దృష్టి మాజీ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ముల్లా ఖాదర్ బాషాకు నీటి సరఫరా కోసం ఒక ట్రాక్టర్ ద్వారా రోజుకు ఐదు ట్రిప్పుల సరఫరాకు అవకాశం ఇవ్వగా నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడం కోసం తనకు కేటాయించిన వార్డు పరిధిలో మహిళలతో సమావేశం ఏర్పాటు చేసి నీటి సరఫరా చేసే విధానానికి అందరూ సహకరించాలని మహిళలను కోరారు.

స్థానిక మహిళలు మాట్లాడుతూ ట్యాంకర్లు నీటి సరఫరా చేస్తే సరిపడ నీరు అందడం కష్టమని….. పరిష్కారానికై తక్షణమే డీప్ బోరు మంజూరుకు కృషి చేయాలని కోరగా బాషా మాట్లాడుతూ ప్రస్తుతం నేను ఆ యొక్క అంశాన్ని మాజీ పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని త్వరలో ఆయన ఆశీస్సులతో మంజూరు చేయిస్తానని ఆ లోపు అందుబాటులో ఉన్న నీటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.

మంచి నీటి సమస్య పరిష్కారం కోసం ఎలాంటి అవాంతరాలు ఎదురైనా తాము అండగా ఉంటామని మహిళలు ఆయనకు భరోసా కల్పించారు.