రీ సర్వే ప్రక్రియ ను పరిశీలించిన తహశీల్దారు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

రీ సర్వే ప్రక్రియ ను పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు భాగ్యలక్ష్మి పరిశీలించారు.

బుధవారం నాడు స్థానిక అక్కచెరువు గ్రామం నందు జరుగుతున్న రీ సర్వే ప్రక్రియ ను తహశీల్దారు భాగ్యలక్ష్మి సందర్శించి సంబంధించిన దస్త్రాలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ బ్రహ్మం మరియు గ్రామ రెవెన్యూ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.