తెదేపా నుండి చేరికలు వద్దని కుందూరుకు విన్నమించిన వైసీపీ మైనారిటీ నాయకులు

తెలుగుదేశం పార్టీ నుండి వైయస్ఆర్సీపి లోకి చేరికలు వద్దని మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డికి పొదిలి పట్టణ వైసీపీ మైనారిటీ నాయకులు విన్నమించారు.

వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన మైనారిటీ నేతలు వైయస్ఆర్సీపిలోకి చేరుటకు పార్టీలోని కొంతమంది ముఖ్య నాయకులు రంగం సిద్ధంచేసి ఆదివారం నాడు భారీ ఎత్తున చేరికలకు సన్నాహాలు చేయడం ముందుగా పసిగట్టిన పంచాయతీ మాజీ పాలకవర్గ సభ్యులు ముల్లా ఖాదర్ బాషా, చోటా ఖాసిం, షేక్ నూర్జహన్, యువజన నాయకులు షేక్ గౌస్, తదితరులు శనివారం రాత్రి స్థానికంగా ఉండే మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనువాసులరెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి ఎన్నికలల్లో పార్టీకి పని చేసిన మమ్మల్ని మరచి తెదేపా నుండి చేరికలకు రంగం సిద్ధం చేయడం సరైనది కాదని ఉడుములకు విజ్ఞప్తి చేయగా మీరు మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డిని కలసి మీ యెక్క సమస్యలు తెలియజేయాలని సూచించారు.

ఉడుముల సూచనల మేరకు ఆదివారం 10వాహనాలలో మార్కాపురం బైలుదేరే సమయంలో స్థానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి పొదిలి వస్తున్నారని సమాచారం అందించగా ఉడుమల స్వగృహంలో నందు శాసనసభ్యులు కుందూరుతో పట్టణ వైకాపా కార్యకర్తలు తమగోడు విన్నపించారు.

గత ఐదు సంవత్సరాలగా పార్టీని కనిపెట్టుకుని పనిచేస్తున్న మమ్మల్ని కాదని తెదేపా నుండి చేరికలకు రంగం సిద్ధం చేయడం సరైనది కాదని తెలియజేశారు. దానితో శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి వారితో మాట్లాడుతూ పట్టణంలో ఎవరిని చేర్చుకునే ఆలోచన లేదని ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే పార్టీ కార్యకర్తల అభిప్రాయం తీసుకుని చేర్చుకోవడం జరుగుతుందని మీరు ఎలాంటి అపోహలకు గురి కావలసిన అవసరం లేదని తెల్చి చెప్పారు. కుందూరు మాటఇవ్వడంతో నేడు తెదేపా నుండి చేరాలని అనుకున్న నాయకులు పరిస్థితి తాత్కాలికంగా వాయిదా పడినట్లా లేక అసలు చేర్చుకోలసిన పరిస్థితి లేదా అనేది కొంతకాలం వేచి చూడవలసిందే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.