తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ…. ఎనిమిది మందికి గాయాలు

తెలుగుదేశం పార్టీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ఎనిమిది మంది గాయపడిన సంఘటన గురువారంనాడు చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా మర్రిపూడి మండలం చిమట గ్రామంలో వైకాపా కార్యకర్తలు గ్రామంలో బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాల్చే క్రమంలో కాలుస్తున్న బాణాసంచా సామాగ్రి తెదేపా కార్యకర్తల నివాసాలపై పడడంతో తెదేపా, వైకాపా కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగడంతో ఎనిమిది తెదేపా, వైకాపా కార్యకర్తలు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్ కు తరలించారు.