యుటిఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఫేషియల్ రికగ్నిషన్ యాప్ రద్దు చేయాలని సిపియస్ రద్దు చేయాలని కోరుతూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యుటియఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా నిర్వహించారు.
గురువారం నాడు స్థానిక పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం వద్ద యుటియఫ్ నాయకులు బాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి డిప్యూటీ తహశీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సిపియస్ రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1 తేదీ తలపెట్టిన మిలియన్ మార్చ్ సందర్భంగా అక్రమంగా ఉపాధ్యాయులకు నోటిసులు ఇచ్చి బైండోవర్ కేసులు నమోదు చెయ్యటం దుర్మార్గ చర్యని అన్నారు.
నేటి నుంచి తలపెట్టిన ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ను 70 శాతం ఉపాధ్యాయులు బాయ్ కాట్ చేసారని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ను రద్దు చేయాలని,పాత పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పొదిలి కొనకనమిట్ల,మర్రిపూడి మండలాల యుటిఎఫ్ నాయకులు షేక్ అబ్దుల్ హై,పెమ్మని బాల వెంకటేశ్వర్లు మరియు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు