మహోన్నత వ్యక్తి వెన్నెల వెంకటేశ్వరరావు

వెన్నెల వెంకటేశ్వరరావు స్వయం క్రమశిక్షణ కలిగిన మహోన్నత వ్యక్తి అని దళిత మహాసభ జిల్లా కార్యదర్శి దర్నాసి పెద్దన్న అన్నారు.

వివరాల్లోకి వెళితే పినాకిని బ్యాంకు మాజీ డైరెక్టర్ స్వర్గీయ వెన్నెల వెంకటేశ్వరరావు సంతాపసభ శనివారం స్థానిక శివాలయం నందు ధర్నాసి పెద్దన్న అధ్యక్షతన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ వెన్నెల నాటక రంగంలో మంచి కళాకారుడే కాకుండా మంచి చిత్రకారుడని…. అదేవిధంగా ఐదు చలనచిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక చలనచిత్రానికి నిర్మాతగా వ్యవహరించారని….. అనంతరం రాజకీయ రంగంలో ప్రవేశించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో అత్యంత సన్నిహితంగా మెలిగి జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర సంపాదించారని….. అదేవిధంగా పలు ప్రభుత్వ నామినేటడ్ పదవులలో కొనసాగి తనదైన శైలిలో పనిచేసి ప్రజా మన్ననలు పొందారని….. అలాగే పేద బడుగు బలహీన వర్గాలకు తన వంతుగా సాయమందిస్తూ, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఒక రాష్ట్రస్థాయి నాయకుడిగా అహర్నిశలు కృషిచేసి ప్రజల పక్షాన నిలబడిన మహోన్నతుడు, నిరాడంబరంగా జీవించిన వ్యక్తి వెన్నెల అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో షేక్ సైదా, యర్రమోతు శ్రీనివాసులు, షేక్ హుస్సేన్ పాచ్చా, యర్రమూడి గాంగధర్, వెన్నెల సుబ్బారావు, శ్రీనివాసులు, యాదగిరి సురేష్, తదితరులు పాల్గొన్నారు.