పొదిలి నగర పంచాయతీ కేసు ను జూన్ మూడో వారంకు వాయిదా వేసిన హైకోర్టు

పొదిలి నగర పంచాయతీ సంబంధించిన కేసును జూన్ మూడో వారం కు హైకోర్టు దిసభ్య ధర్మాసనం మంగళవారం నాడు వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాల్లో విలీనం చేసిన గ్రామల పై ‌వేరువేరుగా దాఖల చేసిన రిట్ పిటిషన్లు కలిపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరుఫ్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చెప్పటం జరిగింది.

అందులో భాగంగా మంగళవారం నాడు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు ప్రభుత్వం అటార్నీ జర్నల్ హాజరై హైకోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఎన్నికలు నిర్వహించామని తెలిపాగా అందుకు సంబంధించి ప్రమాణపత్రాన్నిదాఖల చెయ్యాలని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించి తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరంకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ వాయిదా వేసింది.

తదుపరి విచారణ ‌ జూన్ మూడో వారం లో జరిగే అవకాశం ఉంటుందని  న్యాయవాద వర్గాల సమాచారం