నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన శాసనసభ్యులు కుందూరు
నిత్యావసర సరుకులను మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
వివరాల్లోకి వెళితే స్థానిక తహశీల్దార్ కార్యాలయం నందు గునుపూడి వరలక్ష్మమ్మ సుబ్బారావు మరియు గునుపూడి తాయారమ్మ చెంచయ్య ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారంనాడు నేతపాలెంకు చెందిన 170కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ తహశీల్దారు ప్రభాకరరావు, ట్రస్ట్ నిర్వాహకులు గునుపూడి చెంచు సుబ్బారావు, గునుపూడి మధు మరియు సంస్థ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.