అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు సీజ్

మండల పరిధిలోని ఏలూరు గ్రామ సమీప వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న సమాచారంతో పొదిలి ఎస్ఐ సురేష్ తన సిబ్బందితో కలిసి ఏలూరు వెళ్తున్న క్రమంలో ఇసుక లోడుతో వస్తున్న మూడు ట్రాక్టర్లను మార్గం మధ్యలో గుర్తించి ట్రాక్టర్లను పోలీసు స్టేషన్ కు తరలించి వాహనాలను సీజ్ చేసి తరలిస్తున్న వారిపై కేసులు నమోదుచేసి కోర్టుకు హాజరు పరిచినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు.