క్లిష్టమైన కవలల కాన్పును విజయవంతం చేసిన డాక్టర్ చక్రవర్తి మరియు బృందం

పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో అతి క్లిష్టమైన కవలల కాన్పును ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చక్రవర్తి ఆధ్వర్యంలో వారి బృందం విజయవంతం చేశారు.

డాక్టర్ చక్రవర్తి తెలిపిన వివరాల మేరకు…… కొనకనమిట్ల మండలం వాగుమడుగు గ్రామానికి చెందిన కె బాలమ్మకు పురిటి నొప్పులతో రెండవ కాన్పు నిమిత్తం పొదిలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా డాక్టర్ చక్రవర్తి వైద్యపరీక్షలు నిర్వహించారు.

సాధారణంగా కవలల ప్రసవాలు సర్వసాధారణం అయినప్పటికీ….. ప్రసవ సమయంలో మహిళకు 16నుండి 17మిల్లీ గ్రాముల రక్తం ఉండాల్సి ఉండగా ఈ మహిళకు మాత్రం రక్తం అతితక్కువ స్థాయిలో 4మిల్లీ గ్రాముల మాత్రమే ఉండడం 108వాహనంలో ఒంగోలుకు ప్రయాణించే పరిస్థితి కూడా లేకపోవడంతో ప్రసవం క్లిష్టమయినా కూడా నా ఆధ్వర్యంలో ఎంతో సాహసోపేతమైన ఈ ప్రసవాన్ని స్టాఫ్ నర్సు అరుణ అత్యంత చాకచక్యంగా ప్రసవ సమయంలో ఎక్కువ రక్తం పోకుండా ఈ క్లిష్టమైన కాన్పును విజయవంతం చేయడం జరిగిందని…… ఇంతటి క్లిష్టమైన కాన్పును విజయవంతం చేసినందుకు గాను స్టాఫ్ నర్సు అరుణను సిబ్బందితో కలిసి సన్మానించడం జరుగుతుందని ఆయన తెలిపారు…….. అయితే ఇక్కడ ప్రసవించిన మహిళకు మొదటి ప్రసవానికి రెండవ ప్రసవానికి 12సంవత్సరాల దూరం ఉండడం అలాగే రెండవ ప్రసవంలో కవలలకు జన్మనివ్వడం విశేషం.