ఓటమికి వైసీపీ నుండి వచ్చిన వలసలు…. స్థానిక నాయకుల పోకడలే కారణమని కార్యకర్తల విమర్శలు

మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి ఓటమికి వైసీపీ నుంచి వచ్చిన వలస నాయకులను దగ్గరకి చేర్చుకోవటం అలానే స్థానిక నాయకులను విస్మరించడం ఓటమికి ప్రధాన కారణమని…. అనంతరం ఎన్నికల సమయంలో వలస వచ్చిన వైసీపీ నాయకులు తిరిగి తమ సొంతగూటికి చేరడం….. పార్టీలో ఉన్న కార్యకర్తలు చురుగ్గా పని చేయకపోవడం….. అదేవిధంగా కొంతమంది వైసీపీ రహస్య అవగాహనా ఒప్పందాల వలన పొదిలి మండలంలో భారీ నష్టం జరిగిందని ఎండీ గౌస్ ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానిక రథం రోడ్డులోని సామంతపూడి నాగేశ్వరరావు సామిల్ నందు ఏర్పాటు చేసిన తెలుగుదేశంపార్టీ పొదిలి మండల కార్యకర్తలు సమావేశంలో పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ స్ధానిక నాయకులు అనుసరించిన తీరువలనే గ్రామలలో భారీగా ఓటుబ్యాంకు నష్టపోయి ఓటమి చవిచూడలవలసి వచ్చిందని అలాంటి నాయకులను దూరంపెట్టి యువతకు పెద్ద పీఠ వేయాలని కోరారు.

మరికొందరు మాట్లాడుతూ మన ఓటమి స్వయంకృపారాధమని భవిష్యత్తులో ఇలాంటి నాయకులను దూరంగా పెట్టాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి మండలంలోని నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. అయితే ఈ కార్యకర్తల సమావేశానికి మండల పార్టీ అధ్యక్షులు కాటూరి పెద్దబాబు, తెలుగు యువత అధ్యక్షులు ఉదయ్ యాదవ్, తెదేపా నాయకులు శ్రావణి వెంకటేశ్వర్లు, ఆవులూరి యలమంద, డుమ్మా కొట్టడం విశేషం.