ప్రభుత్వ వైద్యశాలలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు

ప్రభుత్వ వైద్యశాలలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు

పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో నందు విజిలెన్స్ అధికారులు తనిఖీ నిర్వహించారు.

గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాల్లో తనిఖీలు నిర్వహించడంలో భాగంగా పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో తనిఖీలు నిర్వహించినట్లు విజిలెన్స్ డి.ఎస్.పి అశోక్ వర్ధన్ తెలిపారు.

ప్రభుత్వ వైద్యాధికారులను సిబ్బంది కొరత ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల నిల్వలు బయోమెట్రిక్ అటెండెన్స్ పనితీరును వైద్యాధికారి చక్రవర్తి అడిగి వివరాలను తెలుసుకున్నారు..

పని చెయ్యని ఎక్స్ రే, అల్ట్రా సౌండ్ యంత్రాలను విజిలెన్స్ అధికారులు గుర్తించారు రోగులకు అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేసి.. సిబ్బంది కొరత మందుల సరఫరాపై ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి చక్రవర్తి ఫార్మసిస్ట్ వైద్య సిబ్బంది విజిలెన్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.