నీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని జలశక్తి అభియాన్ ప్రత్యేకాధికారిని కలిసిన సాయి రాజేశ్వరరావు…….

పొదిలి, మర్రిపూడి, కొనకనమిట్ల మండలాలకు తాగునీటిని అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫారసు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ, జలశక్తి అభియాన్ ప్రత్యేకాధికారి బి.ఎన్ రెడ్డిని కలిసిన మాజీ జడ్పీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావు కోరారు.

వివరాల్లోకి వెళితే కేంద్ర జలశక్తి అభియాన్ ప్రత్యేకాధికారి బిఎన్ రెడ్డి గత రెండు రోజులుగా జిల్లాలో పర్యటన ముగింపు సందర్భంగా జిల్లా కలెక్టర్, నీటిపారుదల శాఖ, రక్షిత నీటి సరఫరా శాఖ జిల్లా అధికారులతో సమీక్ష కార్యక్రమం ఏర్పాటు చేసి జిల్లాలోని నీటి సమస్య, నివారణకు చేపట్టవలసిన అంశాలను గురించి జరిగిన చర్చ అనంతరం……. ఆయనను మాజీ జడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు కలిసి పొదిలి, మర్రిపూడి, కొనకనమిట్ల మండలాలలో ప్రజలు పడుతున్న నీటి కష్టాలను ఆయనకు వివరించి పొదిలి పెద్దచెరువును పూర్తిస్థాయిలో రిజర్వాయర్ గా మారిస్తే దాదాపు 3మండలాల్లోని 84గ్రామాలకు నీటి ఎద్దడిని తగ్గించి తాగునీటిని అందించగలమని…..

గతంలో రక్షిత నీటి సరఫరా శాఖ ఈ ప్రాజెక్టును ప్రతిపాదించినప్పటికి ప్రస్తుతం ప్రాజెక్టు పెండింగ్ లో ఉన్నదని జలశక్తి శాఖ ద్వారా తమరు సిఫారసు చేయాలని కోరి…. వాటికి సంబంధించిన దినపత్రిక ప్రచురణలు, రిపోర్ట్ కాపీలను అందించగా….. ప్రస్తుతం జిల్లా పర్యటనలోని అంశాలతో పాటుగా ఈ అంశాన్ని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫారసు చేస్తామని హామీ ఇచ్చారని మాజీ జడ్పీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.