యాదవుల నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా పయాణించాలి: శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి

యాదవుల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యే దిశగా యస్సీ, యస్టీ, బిసి మైనారిటీలను కలుపుకుని ముందుకు వెళ్ళాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ బిసి సంక్షేమ కమిటీ చైర్మన్ మరియు శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి అన్నారు.

వివరాల్లోకి వెళితే అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వనమహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ యాదవ సంఘాల నుండి నాయకత్వం రాజకీయంగా, ఆర్ధికంగా ఎదగాలని నాయకత్వం వహించేవారు అహం వదిలి ఓర్పు,నేర్పు,సహనంతో ప్రజలకు నమ్మకం కల్పించేదిశగా ఇతర వర్గాలను కలుపుకుని రాజ్యధికారం సాధించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పట్టెబోయిన మాలకొండయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి యర్రాకుల తులసీరామ్ యాదవ్,
ముఖ్య కార్యదర్శిలు యస్ యస్ రాజా యాదవ్, అంగిరాకుల ఆదిశేషు, ఓబిసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంగిరాకుల వరప్రసాద్, బిజెపి ఓబిసి మోర్చా అధ్యక్షులు తానికొండ సురేష్ యాదవ్, వైసీపీ నాయకులు కఠారి ప్రసాద్ యాదవ్, మాజీ జడ్పీటిసిలు శివరాత్రి శ్రీనివాస్ యాదవ్, మెట్ల రాఘవరావు, బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు బంకా చిరంజీవి యాదవ్, స్థానిక యాదవ మహాసభ నాయకులు పొల్లా నరసింహ యాదవ్, మూరబోయిన బాబూరావు యాదవ్, మువ్వా కాటంరాజు యాదవ్, కనకం వెంకట్రావ్ యాదవ్, పెమ్మని రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.