పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కిట్లును పంపిణీ చేసిన ‌జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్

గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కిట్లును జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ పంపిణీ చేశారు.

వివరాల్లోకి వెళితే కరోనా నిర్ధారణ కేసు నమోదు అయిన రామాపురం గ్రామంలో పనిచేస్తున్న పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కిట్లును పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో గురువారంనాడు జిల్లా పంచాయతీ అధికారి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ చేతులు మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల రక్షణ కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా వారికి అండగా ఉంటూ వారి ఆరోగ్యాన్ని కాపాడడంలో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.